: 11 గంటలైనా పని ప్రారంభించకపోతే ఎలా?: డీఆర్డీఏ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం
విశాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందిపై ఏపీ మంత్రి మృణాళిని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె విశాఖలోని డీఆర్డీఏ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి తనిఖీలకు వచ్చిన సమయంలో కొంతమంది సిబ్బంది కార్యాలయానికి చేరకపోగా, మరికొంత మంది వచ్చినా కబుర్లలో మునిగిపోయారు. దీంతో మంత్రి సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 11 గంటలు దాటుతున్నా పని ప్రారంభించకపోతే ఎలాగంటూ సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఈ తరహా వ్యవహారం చెల్లదని ఆమె హెచ్చరించారు.