: లెక్కలు రాకపోతే నేర్పుతాను రా!: విలేకరిపై చంద్రబాబు ఆగ్రహం


రైతు రుణ మాఫీ ప్రకటన సందర్భంగా అరకొర సమాచారంతో తనను ప్రశ్నించిన విలేకరిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కలు రాకుంటే నేర్పుతాను రమ్మంటూ ఆయన సదరు మీడియా మిత్రుడికి షాకిచ్చారు. రైతు రుణాలను మాఫీ చేసేందుకు సంబంధించి సిద్ధం చేసిన విధాన ప్రకటనను వివరిస్తున్న సందర్భంగా ఓ విలేకరి రైతుల సంఖ్యపై చంద్రబాబును ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాం నాటి రైతుల సంఖ్యను చెబితే, దానిని ప్రస్తుత సంఖ్యగా ఎలా పరిగణిస్తారని చంద్రబాబు ఆ విలేకరిని నిలదీశారు. ‘‘అసలు మీరు చెబుతున్న లెక్క ఎక్కడుంది? ఏపీలో ఉందా? ఉంటే ఏ జిల్లాలో ఉంది? మీకు లెక్కలు రావేమో... రండి నేర్పుతాను’’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించడంతో ఆ విలేకరి నోరు మూతపడింది.

  • Loading...

More Telugu News