: 22.79 లక్షల కుటుంబాలకు రుణమాఫీతో లాభం: బాబు


తాము చేపట్టిన రైతు రుణమాఫీ తొలివిడతలో మొత్తం 22.79 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 6న రుణవిముక్తి లబ్ధిదారుల తొలి జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రూ.50 వేల లోపు రుణవిముక్తి అయిన రైతులకు లేఖలు పంపుతున్నామని అన్నారు. జన్మభూమి గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్లు చదివి వినిపిస్తామని తెలిపారు. అర్హులైనా పేర్లు రాలేదని భావిస్తే వివరాలు అందించాలని చెప్పారు.

  • Loading...

More Telugu News