: రేపే మహారాష్ట్ర సర్కారు తొలి కేబినెట్ విస్తరణ


మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రేపు తొలి కేబినెట్ విస్తరణ చేపడుతున్నారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఆ రాష్ట్ర విధాన్ భవన్ ప్రాంగణంలో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వంలో చేరేందుకు శివసేన ఆమోదం తెలిపి, పన్నెండు పదవులు దక్కించుకుంది. అయితే, రేపటి కార్యక్రమంలో ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. కానీ, కొంతమంది బీజేపీ నేతలు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గత నెల చివరిలో పదిమంది మంత్రులతో ఫడ్నవిస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది.

  • Loading...

More Telugu News