: జైలు నుంచి 14 రోజుల సెలవు కోరిన సంజయ్ దత్
పూణెలోని ఎరవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాజాగా పద్నాలుగు రోజుల సెలవు కావాలంటూ అధికారులకు దరఖాస్తు చేశాడట. అయితే, సెలవు కోరిన కారణం మాత్రం తెలియరాలేదు. 1993 ముంబయి పేలుళ్ల కేసులో గతేడాది మార్చిలో సుప్రీంకోర్టు సంజయ్ కు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలు సందర్భాల్లో పెరోల్ పై సంజయ్ బయట ఉన్నాడు. ఈ సమయంలో భార్య మాన్యత దత్ అనారోగ్యం, తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు పెరోల్ గడువును రెండుసార్లు పొడిగింప చేయించుకున్నాడు. ఇలా వరుసగా జైలు అధికారులు సంజూకు పెరోల్ ఇవ్వడం వివాదంగా మారింది.