: శ్రీవారిని దర్శించుకున్న సినీనటి నిరోషా
సినీ నటి నిరోషా ఈ ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ప్రభుత్వ రంగ సంస్థల అధ్యయన సంఘం అధ్యక్షుడు కాగిత వెంకట్రావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో వీరు వెంకన్న సేవలో పాల్గొన్నారు.