: రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు బాలికల అదృశ్యం
తెలుగు రాష్ట్రాల్లో బాలబాలికల కిడ్నాప్ లు, అదృశ్య ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం ఘనపూర్ లో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. అనాథాశ్రమంలో ఉంటున్న ప్రియాంక, జెరీనాలు అదృశ్యమయినట్టు ఆశ్రమ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.