: 2015 జూలై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభం


పవిత్ర గోదావరి పుష్కరాల ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 2015 జూలై 14న ఉదయం 6.26 గంటలకు పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14 నుంచి 25 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు సదరు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్థాన పండితుడు తంగిరాల ప్రభాకర పూర్ణయ్య అభిప్రాయాన్ని తీసుకుని పుష్కరాల ముహూర్తాన్ని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

  • Loading...

More Telugu News