: ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉద్యమ నేత పిడమర్తి రవి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఓయూ విద్యార్థుల తరఫున ముందుండి పోరు సాగించిన ఉద్యమ నేత పిడమర్తి రవిని కేసీఆర్ సర్కారు అందలమెక్కించింది. ప్రత్యేక రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ కు ఆయనను తొలి ఛైర్మన్ గా నియమిస్తూ బుధవారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ లభించినప్పటికీ రవి విజయం సాధించలేకపోయారు. ఖమ్మం జిల్లాకు చెందిన పిడమర్తి రవి ఉద్యమంలో ఓయూ జాక్ కన్వీనర్ గా కీలక భూమిక పోషించారు. సీఎంగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నామినేటెడ్ పదవుల పందేరాన్ని పిడమర్తితోనే ప్రారంభించడం గమనార్హం.