: మా ఫ్యామిలీని ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు: వరుణ్ తేజ్
తమ ఫ్యామిలీని ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలని వరుణ్ తేజ్ తెలిపారు. ముకుంద ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తనను నమ్మి సినిమా అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాలకు ధన్యవాదాలని చెప్పారు. తనను, డైరెక్టర్ ను నమ్మి సినిమా చేసిన నిర్మాతలకు రుణపడి ఉంటానని అన్నారు. సినిమాలో తనతో కలిసి నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాకు మంచి సంగీతం ఇచ్చిన మిక్కీ జే మేయర్ కు ధన్యవాదాలు తెలిపారు. తాను నిలబడడానికి కారణం డాడీ చిరంజీవిగారేనని అన్నారు. కేవలం ఆయన కారణంగా ఇండస్ట్రీలో అందరం ఉన్నామని వరుణ్ చెప్పాడు. బాబాయి ఎక్కడున్నా 'బాబాయ్ బెస్ట్ విషెష్' ఉంటాయని అన్నారు. చరణ్ అన్న, అర్జున్, సాయి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. తనకు నటనలో ఓనమాలు నేర్పిన సత్యానంద్ సార్ కు ధన్యవాదాలు అన్నారు. తన వెంట నిలిచిన కుటుంబానికి ఏం చెప్పినా సరిపోదని అన్నారు.