: అన్నయ్య ఆశీస్సులు, తమ్ముడి పవర్, అర్జున్ ఎనర్జీ, చరణ్ ప్రేమ కావాలి: నాగబాబు


తన కుమారుడు వరుణ్ తేజ్ కు అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు, తమ్ముడు పవన్ కల్యాణ్ పవర్, అల్లుడు అల్లు అర్జున్ ఎనర్జీ, కొడుకు రాంచరణ్ ప్రేమ, సాయి ధరమ్ తేజ్ లవ్, అభిమానుల ఆశీస్సులు ఉన్నాయని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. శిల్పకళావేదికలో జరిగిన 'ముకుంద' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎన్నో సినిమా అవకాశాలు ఉన్నప్పటికీ శ్రీకాంత్ అడ్డాల తన కుమారుడితో సినిమా చేయడం అదృష్టమని అన్నారు. అభిమానులు తన కుమారుడ్ని ఆదరించాలని నాగబాబు కోరారు.

  • Loading...

More Telugu News