: తెలుగులో పాట పాడిన పూజా హెగ్డే
ఈ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ముకుంద సినిమాలో నటించిన హీరోయిన్ పూజా హెగ్డే తెలిపారు. హైదరాబాదులోని శిల్ప కళావేదికలో జరిగిన ముకుంద ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తనకు గోపికగా అవకాశమిచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమాలోని ఓ పాటను పాడి అభిమానులను అలరించారు. తనతో నటించిన వరుణ్ తేజ్ చాలా మంచివాడని పేర్కొన్నారు.