: 'ముకుంద'కు సిరివెన్నెల పాటలు రాయడం వరుణ్ అదృష్టం: చిరంజీవి
ప్రతి పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే మిత్రుడు, సరస్వతీ పుత్రుడు సిరివెన్నెల సీతారామశాస్త్రికి ముందు మాట్లాడడం అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగిన ముకుంద సినిమా ఆడియో వేడుక సందర్భంగా సిరివెన్నెలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరస్వతీ పుత్రుడ్ని సత్కరించడమంటే, సరస్వతీదేవిని సత్కరించడమేనని అభిప్రాయపడ్డారు. 'నాగబాబు పుత్రుడు, నా బిడ్డ వరుణ్ తేజ్ కు సిరివెన్నెల పాటలు రాయడం వరుణ్ అదృష్టమని' ఆయన తెలిపారు.