: నాలుగు హెలికాప్టర్లతో కేసీఆర్ ఏరియల్ సర్వే


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు హెలికాప్టర్లతో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఫార్మాసిటీ కోసం రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 వేల ఎకరాలు, మెదక్ జిల్లా పరిధిలో 4 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ నిరుద్యోగుల పాలిట వరంగా ఫార్మాసిటీని నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సర్వేలో సీఎం కేసీఆర్ సహా మొత్తం పది ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫార్మా సిటీకి 'హైదరాబాద్ ఫార్మాసిటీ' అని నామకరణం చేస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యావరణహితంగా ఫార్మాసిటీని నిర్మిస్తామని ఆయన వివరించారు. ఫార్మా కంపెనీల సిబ్బంది కోసం టౌన్ షిప్ లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో ఫార్మాసిటీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఫార్మాసిటీలో 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News