: ప్రియురాలితో కలిసి ప్రియుడి ఘరానా మోసం


హైదరాబాదులో ప్రియురాలితో కలిసి ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. పోలీస్ రిక్రూట్మెంట్ పేరుతో భరత్ అనే వ్యక్తి నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తి, కొందరు నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నాడు. వారికి తన ప్రియురాలిని ఐపీఎస్ అధికారిణిగా పరిచయం చేశాడు. త్వరలో జరగబోయే పోలీస్ రిక్రూట్ మెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి ఇద్దరూ భారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో, అభ్యర్థుల సర్టిఫికేట్లు హైదరాబాదులోని కమిషనరేట్ లోనే భరత్ పరిశీలించడంతో నిరుద్యోగులు అతడిని బాగా నమ్మారు. అయితే, కాలం గడుస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో, అడిగినంత డబ్బు చెల్లించిన నిరుద్యోగులు ఉద్యోగాలు ఎప్పుడంటూ ఒత్తిడి తేసాగారు. దీంతో, అదిగో ఇదిగో అంటూ నకిలీ ఎస్సై, నకిలీ ఐపీఎస్ మొహం చాటేశారు. వారి వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో, నకిలీ ఎస్ఐ, నకిలీ ఐపీఎస్ బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News