: సల్మాన్ పై మరింతగా బిగుసుకున్న ఉచ్చు
2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై మరింతగా ఉచ్చు బిగుసుకుంది. ఆ సమయంలో సల్మాన్ మోతాదుకు మించి మద్యం తాగి ఉన్నాడని పరీక్షలు నిర్వహించిన నిపుణుల బృందం కోర్టుకు తెలిపింది. సల్మాన్ రక్త నమూనాలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉందని వారు నివేదిక ఇచ్చారు. ఇది ఈ కండల వీరుడికి ఇబ్బంది కలిగించే విషయమే. నేరం రుజువైతే గరిష్ఠంగా జీవిత ఖైదును ఆయన అనుభవించాల్సి ఉంటుంది.