: దర్శకుడు వీవీ వినాయక్ ను పరామర్శించిన జగన్
టాలీవుడ్ టాప్ డైరక్టర్ వీవీ వినాయక్ కు మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి నాగరత్నమ్మ (61) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వెంటనే వినాయక్ కు ఫోన్ చేసి పరామర్శించారు. అటు, నైజీరియాలో అపహరణకు గురైన గుంటూరు జిల్లా వ్యక్తి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కూడా జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. కిడ్నాపర్ల నుంచి శ్రీనివాసరావును విడిపించేందుకు కృషి చేస్తామని చెప్పారు.