: టీఆర్ఎస్ ప్రభుత్వంపై ట్విట్టర్ లో నారా లోకేశ్ విమర్శలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ట్విట్టర్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆరు నెలల పాలనలో టీఆర్ఎస్ సాధించింది శూన్యమని ఆరోపించారు. తమ వైఫల్యాలను చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అభివృద్ధి చేయడం టీఆర్ఎస్ కు చేతకాకపోతే రాజీనామా చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటే ఏమిటో టీడీపీ చేసి చూపిస్తుందని చెప్పారు.