: యువతిపై మరో యువతి యాసిడ్ దాడి
యాసిడ్ దాడులంటే నిన్నటిదాకా మగాళ్లు మహిళలపై చేసే దాడిగానే మనకు తెలుసు. తాజాగా తానూ మగాళ్లకు ఏమీ తీసిపోనని విశాఖకు చెందిన ఓ యువతి తన కర్కశత్వాన్ని చాటుకుంది. తనతో గొడవపడ్డ ఓ యువతిపై యాసిడ్ దాడికి దిగింది. దీంతో దాడికి గురైన యువతి తీవ్రగాయాలపాలైంది. గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విశాఖలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.