: ఇంటర్ బోర్డును ఏపీ, రాయలసీమ, తెలంగాణ జోన్ లుగా విభజించండి: ఏబీవీపీ డిమాండ్


హైదరాబాదులోని ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఏబీవీపీ విద్యార్థి నేతలు బైఠాయించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ గందరగోళంగా తయారైందని... స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇంటర్ బోర్డును ఏపీ, తెలంగాణ, రాయలసీమ జోన్ లుగా విభజించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News