: బార్ డాన్సర్ తో ఎంఎల్ఏ 'డర్టీ డాన్స్'
బీహార్లో అధికారంలో ఉన్న జనతా దళ్ (యూ) ప్రభుత్వం మరింత సిగ్గు పడేలా ఆ పార్టీ శాసనసభ్యుడు శ్యాం బహదూర్ సింగ్ అశ్లీల నృత్యాలు చేస్తూ కెమెరాకు దొరికిపోయాడు. ఆయన నియోజకవర్గమైన బర్హారియాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బార్ డాన్సర్ గా భావిస్తున్న యువతితో కలసి అశ్లీలంగా నాట్యం చేస్తూ, అసభ్యకర పోజులిస్తూ కనిపించాడు. శ్యాం బహదూర్ సింగ్ అశ్లీలంగా నృత్యం చేస్తూ కనిపించటం ఇదే తొలిసారి కాదు. 2010లో కూడా ఒకసారి ఇలాగే దొరికి ఆపై తప్పైపోయిందని క్షమాపణలు కోరాడు.