: హ్యూస్ గౌరవార్థం మాక్స్ విల్లే 'మూతపడింది'


విషాదకర పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచిన ఆసీస్ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ ను ఈ ఉదయం క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కాగా, హ్యూస్ గౌరవార్థం స్వస్థలం మాక్స్ విల్లేలో అప్రకటిత బంద్ పాటించారు. దుకాణదారులు స్వచ్ఛందంగా తమ షాపులు మూసివేశారు. హ్యూస్ అంత్యక్రియలకు వెళుతున్నామని, దుకాణానికి సెలవు అని స్టోర్ల వెలుపల నోటీసు బోర్డులు పెట్టారు. అటు, హ్యూస్ అంత్యక్రియలను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో భారీ తెరలపై లైవ్ గా అందించారు.

  • Loading...

More Telugu News