: మూడు రోజులు నెట్ వాడినందుకు మొబైల్ బిల్లు రూ.2లక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి గత నెలలో సింగపూర్ పర్యటనకు వెళ్లిన ప్లానింగ్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ ఠక్కర్ సెల్ ఫోన్ బిల్లు ఏకంగా రూ.2.15 లక్షలు వచ్చింది. అది కూడా కేవలం 3 రోజులకు మాత్రమే. సింగపూర్ లో ఉన్న సమయంలో ఆయన తన మొబైల్ డేటాను వినియోగించి ఇంటర్నెట్ అవసరాలు తీర్చుకున్నారు. నవంబర్ 12 నుంచి 14 వరకు ఫోన్ బిల్లు రూ.2,15,000 అని కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ బిల్లును చూసి ప్లానింగ్ విభాగం అధికారులు అవాక్కయ్యారు. ఈ బిల్లును విడతలవారీ చెల్లించేందుకు అంగీకరించారట. ఇది తెలుసుకున్న తరువాత, జపాన్ పర్యటనకు వెళ్లిన అధికారులు అప్రమత్తమై మొబైల్ డేటా జోలికి పోలేదని సమాచారం.