: పాక్ ఆక్రమించిన భారత భూభాగ విస్తీర్ణం 78,000 చ.కి.మీ.: కేంద్ర ప్రభుత్వం
సరిహద్దు దేశం పాకిస్థాన్ అన్యాయంగా భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో 1948 నుంచి 78,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని లోక్ సభకు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు సభలో మాట్లాడుతూ, 1963 చైనా-పాకిస్థాన్ సరిహద్దు ఒడంబడిక పేరుతో కుదరిన ఒప్పందం ప్రకారం, పాక్ ఆక్రమిత కాశ్మీరులోని 5,180 చదరపు కిలో మీటర్ల భారత భూభాగాన్ని పాక్ చైనాకు అక్రమంగా ఇచ్చినట్టు సభకు వివరించారు. కాగా, భారత-చైనా సరిహద్దుకు సంబంధించి ఉమ్మడిగా నిర్ణయించిన వాస్తవ నియంత్రణ రేఖ (ఎన్ఏసీ) ఏమీ లేదని చెప్పారు. ఇదిలా ఉంచితే, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రదేశమేమీ లేదని మంత్రి వెల్లడించారు.