: 'టార్గెట్ మోదీ' విపక్షాల కొత్త రూటు
కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇంత అభ్యంతరకరంగా మాట్లాడినా ఆమెను మంత్రి పదవిలో కొనసాగించడంపై మిగతా పార్టీలన్నీ మోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. 'మోదీ జవాబ్ దో' అంటూ పార్లమెంట్ ఉభయసభల్లో సభ్యులు నినాదాలు చేశారు. సాధ్వి చేసిన వ్యాఖ్యలు మత ఘర్షణలకు, ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసేవేనని పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.