: కిడ్నాప్ ఉదంతం... నైజీరియాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన ఏపీ ప్రభుత్వం


నైజీరియాలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (26)ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. రెండున్నరేళ్లుగా నైజీరియాలో ఉద్యోగ నిమిత్తం ఉన్న శ్రీనివాసరావును కిడ్నాప్ చేశారని అతడి స్నేహితులు ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంత వరకు అతని ఆచూకీ తెలియలేదు. కిడ్నాప్ చేసిన వారు ఇంతవరకు ఎలాంటి డిమాండ్లు చేయకపోవడంతో... ఎవరు కిడ్నాప్ చేశారన్న విషయం కూడా అర్థం కాకుండా ఉంది. ఈ నేపథ్యంలో, అతని విడుదల కోసం నైజీరియాలోని భారత రాయబార కార్యాలయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. శ్రీనివాసరావు ఆచూకీని త్వరగా కనుక్కోవాలని కోరింది.

  • Loading...

More Telugu News