: పాదచారులపైకి దూసుకెళ్లిన కారు... విశాఖలో ఒకరు మృతి


విశాఖలో బ్రేకులు ఫెయిలైన ఓ కారు బుధవారం బీభత్సం సృష్టించింది. నగరంలోని రావికమతంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, మరో పది మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం ఉదయం రోడ్డుపై వెళుతున్న ఓ కారు బ్రేకులు ఫెయిలైన నేపథ్యంలో పాదచారులపైకి దూసుకెళ్లింది. పాదచారులు తేరుకునేలోగానే వారిని ఢీకొట్టేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News