: 'హీరో'తో ఒప్పందం కుదరడంతో ఉద్విగ్నతకు లోనయ్యా: టైగర్ ఉడ్స్
విఖ్యాత గోల్ఫర్ టైగర్ ఉడ్స్ (38)తో భారత నెంబర్ వన్ ద్విచక్రవాహన తయారీదారు హీరో మోటోకార్ప్ భారీ ఒప్పందం (నాలుగేళ్లకు రూ.250 కోట్లు) కుదుర్చుకోవడం తెలిసిందే. దీనిపై టైగర్ స్పందించాడు. ఓర్లాండోలో మీడియాతో మాట్లాడుతూ, హీరోతో ఒప్పందం కుదరడం పట్ల ఉద్విగ్నతకు లోనయ్యానని తెలిపాడు. "ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వచ్చాను. అక్కడ పవన్ ముంజాల్ (హీరో మోటోకార్ప్ వైస్ చైర్మన్)ను కలిసి, ఆయనతో గోల్ఫ్ కూడా ఆడాను. ఆ తర్వాత ఇద్దరం ఓ రెండు సార్లు కలుసుకున్నాం, కొన్ని చర్చలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ ఒప్పందం కుదిరింది" అని వివరించాడు.