: టీఆర్ఎస్ కౌన్సిలర్ పై కత్తులతో దాడి


సంగారెడ్డి 20వ వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రదీప్ పై కత్తులతో దాడి జరిగింది. మంగళవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్ ను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఉన్న తగాదాల కారణంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News