: సమ్మె పేరిట ప్రజలను ఇబ్బంది పెడితే సహించం: జూడాలకు కామినేని హెచ్చరిక
డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెనుద్దేశించి ఈ రోజు మాట్లాడిన ఆయన తక్షణమే సమ్మెను విరమించాలని జూడాలకు సూచించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని ప్రతిపాదించిన ఆయన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని వెల్లడించారు. మొండి పట్టుదలతో సమ్మె కొనసాగిస్తే ఇకపై సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.