: రేపు ఏపీలో రుణమాఫీ విధివిధానాల ప్రకటన


ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు మంగళవారం సంబంధిత మంత్రులతో భేటీ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రుణ మాఫీ విధివిధానాలను ఈ నెల 4న ప్రకటించనున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. మొత్తం ఒకేసారి కాకుండా విడతలవారీగా బ్యాంకులకు నిధులను విడుదల చేయడం ద్వారా రుణమాఫీని పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తొలుత 20 శాతం మేర నిధులను బ్యాంకులకు విడుదల చేసి, మిగిలిన 80 శాతం నిధులకు గ్యారెంటీ ఇచ్చేందుకు దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతేకాక రుణమాఫీకి సంబంధించి ఏ మేరకు రుణాలున్నా, రైతులకు తొలుత ఊరట కలిగిద్దామన్న అంశంపైనా గురువారం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయనున్నారని పుల్లారావు వివరించారు. ఇదిలా ఉంటే, రైతు రుణమాఫీతో పాటు డ్వాక్రా రుణాల మాఫీపైనా గురువారం ప్రభుత్వం ప్రకటన చేయనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News