: సీబీఐ డైరెక్టర్ గా అనిల్ సిన్హా నియామకం


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్ గా అనిల్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఉత్తర్వులు జారీ చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అనిల్ సిన్హా, బీహార్ కేడర్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి. ఇప్పటిదాకా సీబీఐ డైరెక్టర్ గా కొనసాగిన రంజిత్ సిన్హా మంగళవారం పదవీ విరమణ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన లోక్ పాల్ ఎంపిక కమిటీ మంగళవారం ప్రధాని అధికారిక నివాసంలో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లను కమిటీ ఎంపిక చేయగా, వాటిలో నుంచి అనిల్ సిన్హా పేరును ఖరారు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News