: పెళ్లికాని ప్రసాదులకు శుభవార్త


గోదావరి పుష్కరాల సందర్భంగా పెళ్లి ముహూర్తాలు లేవని, పుష్కరాలు జరిగే ఏడాది పెళ్లిళ్లు చేసుకుంటే దుష్ఫలితాలు ఉంటాయని... పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో పెళ్లికాని ప్రసాదుల్లో నిరుత్సాహం నెలకొంది. అయితే గంగా, గోదావరి నదుల్లో పుష్కరాలు జరిగిన సందర్భంలో 79 రోజుల వరకు పెళ్లి చేసుకోకూడదని, కుంభమేళా జరిగే సందర్భంలోనే ఆ ప్రాంత ప్రజలకు ఏడాది పాటు పెళ్లి ముహూర్తాలు ఉండవని జ్యోతిష పండితులు పేర్కొన్నారు. పుష్కరాల తరువాత ఎలాగూ ఆషాఢ మాసం, శూన్యమాసం వస్తాయని, అప్పుడు ఎలాగూ పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉండదు కనుక పెళ్లికాని ప్రసాదులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. జూలై 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు పెళ్లి చేసుకోకూడదని, ఆ తరువాత పెళ్లిళ్లు నిర్విఘ్నంగా చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News