: చింతగుప్ప మృతులకు కేంద్రం భారీ పరిహారం


ఛత్తీస్ గఢ్ లోని చింతగుప్ప అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భారీ పరిహారం ప్రకటించారు. రాయ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, విధులు నిర్వర్తించి వస్తూ మావోయిస్టుల దాడిలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి 38 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే క్షతగాత్రులకు 65 వేల రూపాయల పరిహారం అందజేయనున్నామని ఆయన వెల్లడించారు. మావోయిస్టులు దొంగదెబ్బతీస్తున్నారని, ముఖాముఖి యుద్ధానికి దిగితే అసలు విషయం తేలిపోతుందని ఆయన సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News