: కేజీ బియ్యం రూపాయి...ఇసుక రెండు రూపాయలు!: ధర్మాన ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ లో కేజీ బియ్యం రూపాయికే లభిస్తుండగా, కేజీ ఇసుక మాత్రం రెండు రూపాయలుగా ఉందని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్త విధానలు అవలంబిస్తోందని విమర్శించారు. నిలకడలేని ఇసుక విధానం, స్థిరమైన విధానం లేని బదిలీలు సీఎం అవగాహనా రాహిత్యాన్ని కళ్లకు కడుతున్నాయని ఆయన అన్నారు. పరిపాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు రాజధానిని అద్భుతంగా నిర్మిస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన పయనింపజేస్తానని కల్లబొల్లికబుర్లు చెబుతున్నారని ఆయన తెలిపారు.