: సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీ విరమణ


సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి రంజిత్ సిన్హా వైదొలగారు. నేటితో ఆయన రెండేళ్ల పదవీకాలం ముగియడంతో దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఒకరోజు ముందు (సోమవారం) మీడియాతో సిన్హా మాట్లాడుతూ, తన పదవీకాలంలో అంత గొప్ప పనులేవీ చేయలేదన్నారు. మీరు ఏది కావాలనుకుంటే అది రాసుకోవచ్చని మీడియాతో అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ స్కాం కేసు దర్యాప్తు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ సిన్హాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు ఆయనను మందిలించింది కూడా. ఈ క్రమంలో దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని ఆయనను కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News