: జార్ఖండ్, జమ్ము కాశ్మీర్ లో ముగిసిన రెండో విడత పోలింగ్
జార్ఖండ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ లో 65 శాతం పోలింగ్ నమోదు కాగా, జమ్ము కాశ్మీర్ లో 71 శాతంతో రికార్డుస్థాయి పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధానంగా, జమ్ము కాశ్మీర్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఈసీ చెప్పింది. ఈ దశలో జార్ఖండ్ లో 20 నియోజకవర్గాల్లో, జమ్ముకాశ్మీర్ లో 18 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కొన్ని రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలో మూడో విడత పోలింగ్ జరగనుంది.