: ధోనీ, భువీ ర్యాంకులు స్వల్ప పతనం
ఐసీసీ తాజా వన్డే క్రికెట్ ర్యాంకులను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓ స్థానం పతనమై 9వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓ స్థానం పతనమై 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. అతని తర్వాతి స్థానంలో రవీంద్ర జడేజా (9వ ర్యాంకు) కొనసాగుతున్నాడు. ఇక, టీం విభాగంలో భారత్ రెండోస్థానంలో ఎలాంటి మార్పులేదు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా ఉంది.