: లోకేష్ స్ట్రాటజీ వర్కౌటవుతోంది... సభ్యత్వాల సంఖ్య 20 లక్షలు దాటింది


టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ స్ట్రాటజీ మెరుగైన ఫలితాలనిచ్చింది. కార్యకర్తల సంక్షేమం కోసం భారీ కార్యక్రమం చేపట్టి, దాని ద్వారా పార్టీని మరింత పటిష్ఠం చేయాలన్న లోకేష్ ప్రణాళిక ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది. టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేషమైన ఆదరణ లభించింది. 25 లక్షల మంది తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకుంటే తమ లక్ష్యం నెరవేరుతుందని, పార్టీ మరింత పటిష్ఠ స్థితికి చేరుతుందని లోకేష్ భావించారు. కాగా, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 20 లక్షల మంది టీడీపీలో సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. దీనిపట్ల టీడీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. త్వరలో రెండో విడతగా తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టనుంది.

  • Loading...

More Telugu News