: చోరీకని వచ్చాడు ... వచ్చిన పని మర్చిపోయాడు!
అమెరికాలో ఓ దొంగ విచిత్రమైన రీతిలో దొరికిపోయాడు. ఆస్టిన్ నగరంలో హడ్సన్ మీట్స్ (మాంసం శుద్ధి కేంద్రం) స్టోర్లో చోరీ చేయాలని రికార్డో కార్డోనా (28) అనే దొంగ నిర్ణయించుకున్నాడు. సుమారు 20 నిమిషాల పాటు కష్టపడి ఫ్రంట్ డోర్ ను బద్దలు కొట్టాడు. లోపల గడ్డకట్టించే శీతల వాతావరణం! మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్ రూంలోంచి నడుచుకుంటూ వెళ్లి, సాసేజి (ఓ రకమైన మాంసం ఉత్పత్తి)లను దొంగిలించాడు. వెంటనే బయటికివచ్చాడు. అయితే, మరోసారి లోపలికి వెళ్లాడు. ఈసారి, అక్కడ కనిపించిన ఓ కోటు తీసుకుని, అక్కడే, ఆఫీసులో గుర్రుపెట్టాడు. ఉదయం ఏడింటికి పోలీసులు వచ్చి లేపాల్సి వచ్చింది కార్డోనా మహాశయుడిని. అతడిని అరెస్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేశారు.