: లెబనాన్ దళాల అదుపులో ఐఎస్ఐఎస్ చీఫ్ భార్య, కుమారుడు
ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్-బాగ్దాదీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య, కుమారుడిని లెబనాన్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కొన్నిరోజుల క్రితం వారు సిరియా నుంచి లెబనాన్ లో ప్రవేశిస్తూ భద్రత బలగాలకు పట్టుబడ్డారు. బాగ్దాదీకి పెక్కు మంది భార్యలున్నారు. సంతానం కూడా తక్కువేమీ కాదు. కాగా, తాము అదుపులోకి తీసుకున్న మహిళ పేరు, జాతీయత వెల్లడించడానికి లెబనాన్ అధికారులు నిరాకరించారు.