: గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి ఎబోలా లేదని నిర్ధారణ


ఇటీవలే నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త హైదరాబాద్ వాసుల్లో భయాందోళనలు రేకెత్తించింది. అయితే, ఆ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతనికి ఆ వ్యాధి లేదని నిర్ధారించారు. కొత్త వైరస్ లక్షణాలు అతనిలో కనిపించినందున మొదట్లో అనుమానించామని... రక్త నమూనాలను ఢిల్లీకి పంపించామని... కొన్ని గంటల్లోనే ఢిల్లీ నుంచి రిపోర్టులు వచ్చాయని... అతనిలో ఎబోలా లక్షణాలు లేవని రిపోర్టులో ఉందని వైద్యులు తెలిపారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News