: చర్చ్ ని తగులబెట్టిన దుండగులు... ఢిల్లీలో స్వల్ప ఉద్రిక్తత


తూర్పు ఢిల్లీ పరిధిలోని దిల్షాద్ గార్డెన్ సమీపంలో సెయింట్ సెబాస్టియన్ చర్చ్ దహనం ఘటన ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి నిప్పు పెట్టాడని చర్చ్ నిర్వాహకులు తెలిపారు. ఫిర్యాదు చేయగానే పోలీసులు స్పందించలేదని ఆరోపిస్తూ, వందలాది మంది ఢిల్లీ పోలీసు కార్యాలయం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, చర్చ్ ఆవరణలో కిరోసిన్ ఆనవాళ్ళు ఉన్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. దీంతో ఎవరో కావాలనే చర్చీకి నిప్పంటించినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News