: గూగుల్ క్యాంపస్ నియామకాల్లో తెలుగమ్మాయి ఎంపిక


ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ కు ఖమ్మం జిల్లాకు చెందిన తోటకూర శ్రీమేఘన ఎంపికైంది. ఈ మేరకు ముంబయిలో నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో గూగుల్ తనను సెలెక్ట్ చేసుకుంది. ఇందుకుగానూ ఏడాదికి ఆమెకు రూ.75 లక్షల వేతనం ఇవ్వనుంది. గూగుల్ సంస్థ ఇటీవల నిర్వహించిన ప్రపంచవ్యాప్త రాత పరీక్షలో 57వ ర్యాంకు, అటు జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు శ్రీ సాధించింది. ఈ క్రమంలో ముంబయిలో నిర్వహించిన ముఖాముఖి ఇంటర్వ్యూలో శ్రీ ఎంపికైంది. ప్రస్తుతం ఆమె ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతోంది. తండ్రి శ్రీనివాస్ చెన్నై ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజినీరుగా పని చేస్తుండగా, తల్లి వాణి రామగుండంలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వారి స్వస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జుళ్లరావు పేట గ్రామం.

  • Loading...

More Telugu News