: చండీయాగం చేయనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యజ్ఞాలు, యాగాలు, వాస్తు సిద్ధాంతాలపై అపరిమితమైన నమ్మకం ఉంది. గతంలో తెలంగాణ సాధన కోసం ఆయన యాగాలు చేసిన సంగతి తెలిసిందే. ఒకసారి పార్టీ ఆఫీసులో, మరోసారి పార్టీ నేత జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఆయన యాగాలు నిర్వహించారు. తెలంగాణ రావడంతో ఆయనకు యాగాల మీద నమ్మకం బాగా కుదిరినట్టుంది. దీంతో, రానున్న ఫిబ్రవరిలో చండీయాగం యాగం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, తన సొంత ఫాంహౌస్ కు పండితులను కూడా తీసుకెళ్లి స్థల పరీక్ష చేశారు. శృంగేరి పండితులు ఫణి శంకర శర్మ, గోపి శంకర శర్మలతో కలసి యాగం నిర్వహించే స్థలాన్ని ఎంపిక చేశారు.