: ద్రవ్య పరపతిలో ఎలాంటి మార్పులు లేవు: ఆర్బీఐ గవర్నర్
ద్రవ్య పరపతి విధానంలో ఎలాంటి మార్పులు అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. వడ్డీ రేట్లను కూడా యథాతథంగానే కొనసాగించేందుకే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుత సమయంలో వడ్డీ రేట్లలో కోత విధించడాన్ని పరిణితిలేని చర్యగా ఆయన అభివర్ణించారు. నిత్యావసరాల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోనే యథాతథ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపినట్లు ఆయన వివరించారు.