: రాష్ట్రంలో పది... కేంద్రంలో ఒకటి: శివసేనకు దక్కే మంత్రి పదవులివే!
బీజేపీ చిరకాల మిత్రపక్షం శివసేన ఎట్టకేలకు ఇటు సొంత రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలోనూ కేబినెట్ లో చేరేందుకు అంగీకరించింది. అయితే ఆ పార్టీ డిమాండ్ చేసినట్టుగా కాకుండా, బీజేపీ చేసిన ఆఫర్ కే ఉద్ధవ్ థాకరే తలాడించాల్సి వచ్చింది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో పది మంత్రి పదవులు శివసేనకు దక్కనున్నాయి. వీటిలో ఆరు కేబినెట్ బెర్తులు కాగా, నాలుగు సహాయ మంత్రి పదవులున్నాయి. ఇక కేంద్రంలోనూ నరేంద్ర మోదీ సర్కారులో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉద్ధవ్ థాకరే కేవలం ఒకే ఒక్క మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.