: ఛత్తీస్ గఢ్ మావోల దాడిలో అనంత జవాను మృతి
ఛత్తీస్ గఢ్ లో సోమవారం మావోయిస్టులు జరిపిన దాడిలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన జవాను ఉన్నారు. ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా పరిధిలో చోటుచేసుకున్న మావోల దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం డెన్నికోట గ్రామానికి చెందిన రామ్మోహన్ ఈ దాడిలో మరణించారు.