: మత్తుమందిచ్చి ఆభరాణాల దోపిడీ
మంగళగిరి నుంచి భీమవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు మత్తుమందిచ్చి ఆమె వద్ద ఉన్న ఆభరణాలను అపహరించుకుపోయారు. పక్కనే కూర్చున్న మరో మహిళ ఇచ్చిన ఆహార పదార్థాన్ని ఆరగించగా, అందులో కలిపిన మత్తుమందు ప్రభావంతో ఆ మహిళ మత్తులోకి జారుకుంది. దీంతో దుండగులు తమ పని చక్కబెట్టుకుపోయారు. ఈ ఘటనపై బస్సు సిబ్బంది భీమవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.