: ఈ ఏడాది 45 వేల మందికి టిసిఎస్ కొలువులు


అంతర్జాతీయ ఆర్థిక రంగం నెమ్మదించినా, అనిశ్చితి నెలకొన్నా.. దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాదీ భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోనుంది. ఇప్పటికే 25వేల మందికి క్యాంపస్ ఆఫర్లు ఇచ్చి ఉన్నామని, వారు ఈ ఏడాది జూలై నుంచి చేరతారని టిసిఎస్ ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ ముఖర్జీ తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాది కొత్తగా 45 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పారు. అంటే ఉద్యోగులకు ఇక కొలువుల జాతరే. అదే విధంగా ఈ ఏడాది ఉద్యోగులకు 7 నుంచి 10 శాతం వరకూ జీతాల పెంపుదల ఉంటుందని ముఖర్జీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News